Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి, షర్మిల

Revanth Reddy Sharmila Wish Chandrababu Naidu on his Birthday
Advertisement
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చంద్రబాబుకు బర్త్ డే విషెస్
  • ట్వీట్లు చేసిన రేవంత్ రెడ్డి, షర్మిల 
Advertisement
ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నేడు (ఏప్రిల్ 20) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 

"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని కోరుకుంటున్నాను" అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. "ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.
Advertisement
Advertisement
Chandrababu Naidu
Revanth Reddy
YS Sharmila
Birthday Wishes
Andhra Pradesh
Telangana
AP CM
TDP
Politics
Indian Politics

More Telugu News